శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 14, 2020 , 22:25:44

తండ్రిని చంపిన తనయుడు

తండ్రిని చంపిన తనయుడు

భిక్కనూరు (రాజంపేట) : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో కొడుకు తండ్రిని హతమార్చిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తాటిపల్లి మేలయ్య (50) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మేలయ్య ప్రతి విషయానికి కుటుంబ సభ్యులతో గొడవకు దిగేవాడు. గురువారం సైతం మేలయ్య భార్య సునంద, కూతురు ప్రవళికతో గొడవ దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు ప్రశాంత్‌ గొడ్డలితో తండ్రిపై దాడి చేశాడు. మేలయ్యకు ముఖంపై, తలపై బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ పరారీలో ఉన్నట్లు ఎస్సై నవీన్‌ తెలిపారు.logo