శనివారం 30 మే 2020
Telangana - May 11, 2020 , 01:31:45

అమ్మకు అవమానం

అమ్మకు అవమానం

  • ఆస్తి కోసం తల్లిపై కొడుకు దాడి 
  • ఏడు పదుల వయసులో ఇంట్లోంచి గెంటివేత
  • మాతృదినోత్సవం రోజు ఘటన 

సారపాక: తొమ్మిది నెలలపాటు మోసి.. పురిటినొప్పులను భరించి కొడుకుకు జన్మనిచ్చింది.. పెంచి పెద్ద చేసింది.. ముదిమి వయస్సులో కంటికి రెప్పలా చూసుకుంటాడనుకున్న ఆ కొడుకు నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేశాడు. మాతృదినోత్సవంరోజే ఓ అమ్మకు అవమానం జరిగిన ఘటన భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగుచూసింది. సారపాకలోని పాత పంచాయతీ రోడ్‌లో అయిలూరి వెంకట కోటమ్మ(70)- రంగారెడ్డి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రంగారెడ్డి మూడు నెలల క్రితం మృతిచెందాడు. పిల్లలందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. 

ఈ క్రమంలో కొడుకు ఇంట్లో ఉండకుండా తన సొంతింట్లో ఒంటరిగానే ఉంటున్నది.  భర్త మరణం తర్వాత తనను చేరదీసి కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కొడుకు శ్రీనివాసరెడ్డి ఆస్తి కోసం వేధిస్తున్నాడని, ఈ నెల 8న తనపై దాడిచేశాడని వాపోయింది. సొమ్మసిల్లి పడిపోగా స్థానికుల సాయంతో భద్రాచలం వెళ్లి చికిత్స పొందానని చెప్పింది. ఈ క్రమంలో ఆదివారం కొడుకుపై సారపాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. తన కుమారుడి వేధింపుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నది. 


logo