బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:34:49

కేటీఆర్‌ చొరవ.. జేఎన్టీయూ పరీక్షలు వాయిదా

కేటీఆర్‌ చొరవ.. జేఎన్టీయూ పరీక్షలు వాయిదా

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మంత్రి కేటీఆర్‌ చొరవతో జేఎన్‌టీయూ పరిధిలో సోమవా రం, మంగళవారం జరుగాల్సిన రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలు వాయదాపడ్డాయి.  వర్షా లు, వరదల కారణంగా పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయామని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాయలేకున్నామని ఓ యువకుడు మంత్రులు కేటీఆర్‌, సబితాఇంద్రారెడ్డికి ట్వీట్‌ చేశాడు. వెంటనే స్పందించిన కేటీఆర్‌.. తగిన చర్యలు తీసుకోవాలని జేఎన్‌టీయూ వీసీ జయేశ్‌ రంజ న్‌, మంత్రి సబితాఇంద్రారెడ్డికి సూచించారు. కాసేపటికే 19న, 20న జరిగే పరీక్షలను వాయిదావేస్తున్నట్టు జయేశ్‌ రంజన్‌ పోస్ట్‌ చేశారు. వర్షాల కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పేర్కొన్నారు. అటు.. జేఎన్‌టీయూ కూడా ప్రకటన విడుదల చేసింది. మిగతా పరీక్షలు కొనసాగుతాయని, వాయిదా వేసిన పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నది.


logo