సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 01:28:50

కొందరివల్లే పోలీసులకు చెడ్డపేరు: హైకోర్టు

కొందరివల్లే పోలీసులకు చెడ్డపేరు: హైకోర్టు

  • 99.9 % పోలీసులు భేష్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొంతమంది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అనుచితంగా ప్రవర్తించడం వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99.9 శాతం మంది పోలీసులు బాగా పనిచేస్తున్నారని, కరోనా సంక్షోభ సమయంలో వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొన్నది. లాక్‌డౌన్‌ సమయంలో పలువురు పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడులు చేయడంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయా ఘటనల్లో పోలీసుపై తీసుకున్న శాఖాపరమైన చర్యల స్థితిని తెలియజేయాలని ఆ శాఖకు ఆదేశాలు జారీచేసింది. 


logo