నగరంలో అల్లర్లకు కుట్ర: సీపీ అంజనీ కుమార్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొందరు మతపరమైన అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. విద్వేశాలు రెచ్చగొట్టి నగరానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. గత ఏడేండ్లలో హైదరాబాద్ నగరానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. శాంతి భద్రతలు మంచిగా ఉండటం, నేరాల రేటు తక్కువగా ఉండటం, ఎలాంటి మతకల్లోలాలు లేకపోవడంతోనే బోయింగ్, యాపిల్, ఫేస్బుక్ వంటి అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయని చెప్పారు. దీంతో కొదరికి నగరం అభివృద్ధి చెందడం ఇష్టంలేదని, అందుకే విద్వేశాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇలాంటివారికి నగరంలో చోటులేదని చెప్పారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. అసత్యాలు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ప్రచారానికి సంబంధించి ప్రజలు కూడా డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వొచ్చని సూచించారు.
తాజావార్తలు
- కూలీల ట్రాక్టర్ బోల్తా
- నాలుగు లిఫ్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- క్రీడలతో మానసిక ప్రశాంతత
- అంబరంలో విన్యాసాలు అదుర్స్
- థాయ్లాండ్ విజేత మారిన్
- తలైవాకు షాక్: డీఎంకేలోకి రజనీ మాండ్రం నేతలు
- ‘పేదింటి’ స్వప్నం సాకారం
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
- జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
- పీఈటీల అప్గ్రేడేషన్ చేపట్టాలి