సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 17:50:38

భూ సమస్యలకు ధరణితో పరిష్కారం : ఎమ్మెల్యే కంచర్ల

భూ సమస్యలకు ధరణితో పరిష్కారం : ఎమ్మెల్యే కంచర్ల

నల్లగొండ : రైతులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడి (మ్యుటేషన్) వేర్వేరు కార్యాలయాలకు వెళ్లకుండా ఒకే కార్యాలయములో సేవలందించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీర్   ఎంతో  మేలు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. పెద్ద సూరారానికి చెందిన రైతు పెండెం రామకృష్ణ కొనుగోలు చేసిన ఎ.5.17 గుంటల భూమికి రిజిస్ట్రేషన్ చేసి  కేవలం 30 నిమిషాల్లో పట్టదారు పాస్ పుస్తకం అందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సౌకర్యం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూ రికార్డుల నిర్వహణ సులభతరమవుతందని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న భూ రికార్డుల నిర్వహణ సమస్యలకు పరిష్కారం ధరణి అని అన్నారు.  కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ నగార్జునరెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.