గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 20:06:58

సాంకేతికతో వ్యవసాయ సమస్యలకు పరిష్కారం

సాంకేతికతో వ్యవసాయ సమస్యలకు పరిష్కారం

హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీ.కన్సల్ట్ యాప్ వినూత్న సౌలభ్యంతో కూడిన సేవలను అందుబాటులోకి తెస్తున్నది. వ్యవసాయంలో సమస్యలపై సమగ్ర అవగాహన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు, రైతులకు అనుసంధానం చేసేలా టీ. కన్సల్ట్ సన్నాహాలు చేస్తున్నది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వయంగా నిపుణులతో అనుసంధానం అయ్యారు. ఈ యాప్ కు సంబంధించి తొలి వినియోగదారుడిగా మారి తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్, రిటైర్డ్ ప్రొఫెసర్ జలపతిరావుతో టీ.కన్సల్ట్ ద్వారా రైతులకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి టీటా కృషిని కొనియాడారు. ఇది రైతులకు మరింతగా చేరువ కావాలని ఆక్షాంక్షించారు.


logo