సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:27:34

దుబ్బాక అభ్యర్థి సుజాత

దుబ్బాక అభ్యర్థి సుజాత

  • సోలిపేట సతీమణికి టికెట్‌: కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని, ఉద్యమంలో, పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాసవరకు ఎంతో కష్టపడి పనిచేశారని గుర్తుచేశారు. రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాలుపంచుకున్నదని, నియోజకవర్గ ప్రజలతో ఆ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నదని  చెప్పారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి, ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు కావడానికి అతని కుటుంబసభ్యులే ప్రాతినిధ్యం వహించడం సమంజసమని అభిప్రాయపడ్డారు. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారుచేశామని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

సుజాత బయోడాటా

పేరు: సోలిపేట సుజాత

భర్త: సోలిపేట రామలింగారెడ్డి (దివంగత దుబ్బాక ఎమ్మెల్యే)

పుట్టిన తేదీ: 01-01-1969

వివాహం: 26-12-1986, విద్యార్హత: 5వ తరగతి

తల్లిదండ్రులు: లక్కిరెడ్డి రుక్కమ్మ-రాఘవరెడ్డి

కొడుకు: సోలిపేట సతీష్‌రెడ్డి, కూతురు: ఉదయశ్రీ


logo