శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 14:46:29

సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు : సోలిపేట సుజాత‌

సీఎం కేసీఆర్‌కు ధ‌న్య‌వాదాలు : సోలిపేట సుజాత‌

సిద్దిపేట : దుబ్బాక టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు. మంత్రి హ‌రీష్‌రావు నేతృత్వంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఇవాళ సుజాత ఇంటికెళ్లి ఆమెను ప‌రామ‌ర్శించారు. సోలిపేట రామ‌లింగారెడ్డి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం.. ఈ ఉప ఎన్నిక‌లో సుజాత గెలుపు కోసం కృషి చేస్తామ‌ని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా సోలిపేట సుజాత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎల్ల‌ప్పుడూ త‌మ‌కు అండ‌గా నిలిచార‌ని భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్ త‌మ‌ వివాహం చేశారు. త‌మ‌ పిల్ల‌ల పెళ్లిళ్లు కూడా కేసీఆరే చేశారు అని గుర్తు చేసుకున్నారు. త‌న‌ భ‌ర్త చ‌నిపోయిన‌ప్పుడు కూడా అండ‌గా నిలిచారు. రామ‌లింగారెడ్డిలాగే ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాను. సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీష్‌రావు స‌హ‌కారంతో దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి కృషి చేస్తాన‌ని సుజాత‌ స్ప‌ష్టం చేశారు. logo