సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 02:54:56

జలంపై సౌరఫలకం

జలంపై సౌరఫలకం

  • ప్రాజెక్టులకు ముందుకొచ్చిన ఎన్‌హెచ్‌పీసీ
  • సర్వేచేయాలని సూచించిన ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘తెలంగాణలో అపారమైన జలవనరులున్నాయి. దీనిపై సౌ రఫలకాలను ఏర్పాటుచేసి సౌర విద్యుత్‌ను ఒడిసిపట్టుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం’ అని నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) సీఎండీ ఏకే సింగ్‌ చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించిన ఎన్‌హెచ్‌పీసీ ఉన్నతాధికారుల బృందం తెలంగాణ ట్రాన్స్‌ కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, విద్యుత్‌ ఉన్నతాధికారులతో సమావేశమైం ది. రాష్ట్రంలో జలవనరులపై సౌరవిద్యుత్‌ (ఫ్లోటింగ్‌ సోలార్‌ ఎనర్జీ) ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ముందుగా జలవనరులు, అందులో సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభాకర్‌రావు ఆ బృందానికి సూచించారు. అధ్యయన నివేదికలు అం దిస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. కేంద్రం తాజాగా ఫ్లోటింగ్‌ సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తికి ఆయా రాష్ర్టా ల్లో ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఎన్‌హెచ్‌పీసీని ఆదేశించింది. తె లంగాణలో అందుకు పు ష్కలంగా అవకాశం ఉన్న ట్టు కేంద్రం సమాచారమిచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏకే సింగ్‌ నేతృత్వంలో డైరెక్టర్‌ (టెక్నికల్‌) జనార్దన్‌చౌదరి ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో పర్యటించింది.

విద్యుత్‌రంగంలో తెలంగాణ ప్రగతి భేష్‌

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన కొద్దికాలంలోనే విద్యుత్‌ రంగంలో అత్యుత్తమ ప్రగతి సాధించిందని ఎన్‌హెచ్‌పీసీ సీఎండీ ఏకే సింగ్‌ ప్రశంసించారు. రాష్ర్టాన్ని చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకురావడంలో ట్రాన్స్‌కో తదితర విద్యుత్‌ సంస్థల ఇంజినీర్ల కృషిని అభినందించారు. రెండ్రోజుల పర్యటనలో ఎన్‌హెచ్‌పీసీ బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రాతోనూ సమావేశమైంది. టీఎస్‌ రెడ్కో వీసీఎండీ ఎన్‌ జా నయ్య, జీఎం ప్రసాద్‌, పీడీ రామకృష్ణ తదితరుల బృందంతో పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు.  


logo