గురువారం 02 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 01:46:07

భర్త వేధింపులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి

భర్త వేధింపులకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి

  • ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో పోస్టు 

శంషాబాద్‌: భర్త వేధింపులు, మరో మహిళతో వివాహేతర సంబంధం నెరప డాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ ఓ మహిళ సెల్ఫీవీడియోను సోషల్‌ మీడియా లో పోస్టుచేసి ఉరేసుకొంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు, మల్లాది లావణ్య(32)ఎనిమిదేండ్ల క్రితం ప్రేమించి పెండ్లిచేసుకున్నారు. శంషాబాద్‌ పరిధిలోని రాళ్లగూడ సీఎస్‌కే కాలనీ లో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు కలుగలేదు. వెంకటేశ్వరరావు జెట్‌ఎయిర్‌వేస్‌లో పైలట్‌కాగా, లావణ్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పెండ్లయిన కొంతకాలానికే మరో మహిళ తో వెంకటేశ్వరరావు వివాహేతర సంబం ధం పెట్టుకున్నాడని లావణ్య నిలదీయడం తో చిత్రహింసలు ఎక్కువయ్యాయి. ఈ నే పథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు భర్తే కారణమని పేర్కొంటూ సెల్ఫీవీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. అనంతరం గురువారం అర్ధరాత్రి దాటాక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. పోలీసులు భర్తతోపాటు అత్తామామలను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. లావణ్యను భర్త చితకబాదిన వీడియోలను స్వాధీనంచేసుకున్నట్టు సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు.  

మాకూతుర్ని చంపేశాడు.. వీడియో

భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని లావ్యణ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మా అమ్మాయి జీవితాన్ని వాడు(అల్లుడు) నాశనం చేశాడని..


logo