శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 09, 2020 , 02:01:57

సంక్షేమం అద్భుతం

సంక్షేమం అద్భుతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర సంక్షేమపథకాలు అద్భుతంగా ఉన్నాయని సామాజిక ఆర్థికసర్వే-2020 ప్రశంసించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని కొనియాడింది. పేదిం టి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా రూ. 1,00,116 అందించడా న్ని అభినందించింది. షాదీముబారక్‌ కింద 26,914 మంది మైనార్టీ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ. 263.07 కోట్లు ఇచ్చిందని చెప్పింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధినిధి (ఎస్సీఎస్డీఎఫ్‌), ఎస్టీ ప్రత్యేకఅభివృద్ధి నిధి (ఎస్టీఎస్డీఎఫ్‌) కింద వారికి రూ.5 లక్షల ఆర్థిక చేయూతనందించడం ప్రశంసనీయమని సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దళితులకు భూ పంపిణీ పథకం, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఓన్‌ యువర్‌ కార్‌ పేరిటి కార్ల అందజేయడం ప్రశంసనీయమని పేర్కొన్నది. స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ, గిరిజన రైతులకు శిక్షణ అందించి ఆర్థిక ప్రగతి సాధించేలా ప్రోత్సహించడం తదితర అంశాలను సర్వే మెచ్చుకున్నది.logo