గురువారం 02 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 15:11:11

సామాజిక చైతన్యానికి పాటుపడాలి

సామాజిక చైతన్యానికి పాటుపడాలి

వరంగల్ అర్బన్ : మొద‌‌టి నుంచి గౌడ సామాజిక వ‌ర్గం సామాజిక చైత‌న్య కార్యక్రమాల్లో ముందున్నదని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హన్మకొండలోని హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మించిన  కాకతీయ గౌడ హాస్టల్ భవనాన్ని మంత్రులు ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రైతు బంధు స‌మితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో క‌లిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థిక‌, విద్యాభివృద్ధి, సామాజిక చైతన్యం, ఎదుగుదల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం గర్వకారణ మన్నారు. 

వివిధ రంగాల్లో స్థిరపడ్డ వారు, వ్యాపార రంగంలో రాణించిన ప్రతి ఒక్కరూ వారి సామాజిక వర్గం అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. నీరాను త్యరలో అందుబాటులో తీసుకు వస్తామని తెలిపారు. గౌడ సామాజిక వ‌ర్గానికి సీఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నారన్నారు. ఐక్యతతో ఇంతపెద్డ కాకతీయ గౌడ హాస్టల్ భవనాన్ని నిర్మించిన సంఘం ప్రతినిధులను అభినందించారు. 


logo