గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 10, 2020 , 05:22:13

‘సోషల్ మీడియా సంగమం’ అవగాహన సదస్సు

‘సోషల్ మీడియా సంగమం’ అవగాహన సదస్సు

హైదరాబాద్ : సమాచార భారతి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం షేక్‌పేటలోని జీఎన్‌ఐటీలో ‘సోషల్‌ మీడియా సంగమం’ పేరుతో అవగాహన సదస్సు జరిగింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై సోషల్‌ మీడియాలో వ్యతిరేక వార్తలు ప్రచారంలో ఉంటున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. కొంతమంది అసాంఘిక శక్తులు దేశ భద్రతకు ఆటంకం కలిగించే పోస్టులు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సభికులకు దిశా నిర్దేశం చేశారు. నేషనల్‌ సెక్యూరిటీ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌ డాక్టర్‌ పి.వి.రమణ,  ఇంటర్నేషనల్‌ పొలిటికల్‌ సైన్స్‌  అసోసియేషన్‌ మెంబర్‌ డాక్టర్‌ గోపాల్‌ రెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు రాక సుధాకర్‌ రావు, న్యాయవాది నిహారిక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo