సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 01:29:48

‘కొఠారీ’ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం: హరగోపాల్‌

‘కొఠారీ’ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం: హరగోపాల్‌

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : కొఠారీ కమిషన్‌ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం సాధ్యమని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) 4వ రాష్ట్ర మహాసభలను శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్‌ మాట్లాడుతూ ఎన్‌ఈపీ 20 పేరుతో ఫెడరలిజానికి తిలోదకాలిస్తూ కేంద్రం విద్యను తన గుప్పెట్లో పెట్టుకొనేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ప్రొఫెసర్లు మాడభూషి శ్రీధర్‌, నాగేశ్వర్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావా రవి, దుర్గాభవాని, సోమశేఖర్‌, కిష్టయ్య పాల్గొన్నారు. 


logo