సోమవారం 13 జూలై 2020
Telangana - Mar 28, 2020 , 00:14:42

సామాజిక దూరాన్ని పాటించాలి

సామాజిక దూరాన్ని పాటించాలి

- ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డితో కలిసి కరోనా వైరస్‌ నివారణపై సమీక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు 125మందిని క్వారంటైన్‌లో ఉంచిన ట్టు తెలిపారు. అనంతరం రామాయంపేట లో కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు.


logo