బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 19:17:13

సీఎంఆర్‌ఎఫ్‌కు స్నేహ చికెన్‌ అధినేత రూ.కోటి విరాళం

సీఎంఆర్‌ఎఫ్‌కు స్నేహ చికెన్‌ అధినేత రూ.కోటి విరాళం

హైదరాబాద్‌ :  హైదరాబాద్‌లో వరదలు బాధితులను ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సీఎం పిలుపు మేరకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామిక వేత్తలు స్పందించి విరివిగా వివరాళాలు అందజేస్తున్నారు. తాజాగా బుధవారం స్నేహ చికెన్‌ అధినేత రామ్‌రెడ్డి వరద బాధితుల సహాయార్థం సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.కోటి విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి రూ.15 కోట్లు, తమిళనాడు సీఎం రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ రూ.2 కోట్లు, మైహోమ్‌ గ్రూప్‌ రూ.5 కోట్లు ప్రకటించగా.. సినీహీరోలు మహేశ్‌బాబు, చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌ పోతినేని తదితరులు విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.