శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 15:09:02

పాముల‌ను చంపొద్దు : సీపీ అంజ‌నీ కుమార్

పాముల‌ను చంపొద్దు : సీపీ అంజ‌నీ కుమార్

హైద‌రాబాద్ : పాముల‌ను చూసి భ‌య‌ప‌డొద్దు.. వాటిని చంపొద్దు అని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల‌కు అంజ‌నీ కుమార్ వాకింగ్ కు వెళ్లాడు. వాకింగ్ చేసే ప్రాంతంలో త‌న కారు వ‌ద్ద పెంపుడు కుక్క నిరంత‌రాయంగా మొరుగుతుంది. దీన్ని గ‌మ‌నించిన సీపీ.. కారు పార్కింగ్ వ‌ద్ద చెట్ల పొద‌ల‌ను గ‌మ‌నించారు. అక్క‌డ ఓ పాము ఉన్న‌ట్లు గుర్తించారు. త‌క్ష‌ణ‌మే త‌న డిపార్ట్ మెంట్ స‌హాయంతో..  పామును ప‌ట్టుకున్నారు. ఆ త‌ర్వాత పామును నెహ్రూ జూ పార్క్ కు త‌ర‌లించారు. 

ఈ సంద‌ర్భంగా సీపీ అంజ‌నీ కుమార్ మాట్లాడుతూ..  పాముల‌ను చూసిన‌ప్పుడు భ‌య‌ప‌డ‌కూడ‌దు.. వాటిని చంప‌కూడ‌దు అని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ప‌ర్యావ‌ర‌ణంలో భాగ‌మైన జీవుల‌ను ఎప్పుడు కూడా చంపొద్ద‌ని సూచించారు.  పాముల‌ను ప‌ట్టుకుని జూకు త‌ర‌లించాల‌ని చెప్పారు. హైద‌రాబాద్ సిటీ పోలీసుల్లో కొంత మందికి పాములు ప‌ట్టే శిక్ష‌ణ ఇచ్చామ‌ని తెలిపారు. అనేక సంద‌ర్భాల్లో వారు.. పాముల‌ను ప‌ట్టుకున్నార‌ని సీపీ గుర్తు చేశారు. 


logo