శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 25, 2020 , 14:55:39

బాసర ఆలయంలో పాము దర్శనం

బాసర ఆలయంలో పాము దర్శనం

నిర్మల్‌: చదువుల తల్లి సరస్వతి ఆలయంలో పాము దర్శనం ఇచ్చింది. నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని  సరస్వతి ఆలయంలో శనివారం పాము సంచరించడం కలవరపాటుకు గురిచేసినా, భక్తుల చేత పూజలు అందుకుంది. నాగుల పంచమి రోజున ఆలయంలోని వందరూపాయల అక్షరాభ్యాస మండపం వద్ద లింగాకారములో పాము కనిపించడంతో శుభ సూచకంగా భక్తులు పూజలు చేశారు. దాదాపు రెండు గంటల  అనంతరం పాము పరిసర పొదల్లోకి వెళ్లిపోయిందని ఆలయ సిబ్బంది తెలిపారు. కాగా నాగుల పంచమి వేడుకలను ఆదిలాబాద్‌,నిర్మల్‌, నిజామాబాద్‌ తదితర జిల్లాల ప్రజలు భక్తిశ్రద్ధలతో  జరుపుకున్నారు. పుట్టల వద్ద , ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న ప్రకారం సోదరిమణులు తమ సోదరులకు పాలతో కండ్లను కడిగి ఆశీర్వదించారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo