ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 14:29:00

గోల్నాకాలో నాగుపాము కలకలం

గోల్నాకాలో నాగుపాము కలకలం

హైదరాబాద్‌ : కాచిగూడలోని గోల్నాకాలో రహదారిపై నాగుపాము కలకలం సృష్టించింది. ఈ ఘటన బుధవారం ఉదయం గోల్నాక వాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గోల్నాకా వంతెనపై కొంతమంది పామును చూసి పోలీసులకు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని  స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. 

   స్నేక్‌ క్యాచర్‌ అక్కడికి చేరుకొగా పక్కనే ఉన్న కాలనీలోకి పాము వెళ్లింది. దీంతో కాలనీవాసులు  భయాందోళనలకు గురయ్యారు. స్నేక్‌ క్యాచర్‌ పామును పట్టుకున్నారు. పామును జూపార్కు అధికారులకు అప్పగించనున్నట్లు చాదర్‌ఘట్‌ పోలీసులు తెలిపారు. 


logo