బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 16:30:37

సీపీ సజ్జనార్‌ ఇంట్లోకి దూరిన పాము

సీపీ సజ్జనార్‌ ఇంట్లోకి దూరిన పాము

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ఇంట్లోకి ఈ ఉదయం పాము దూరింది. ఐదు అడుగుల పొడవున్న ఈ పాము గార్డెన్‌ నుంచి వచ్చి ఇంట్లోకి దూరింది. ఆ సమయంలో సీపీ ఇంట్లోనే ఉన్నారు. వెంటనే హుస్సేనీ ఆలం కానిస్టేబుల్‌ వెంకటేష్‌ నాయక్‌కు సమాచారం అందించారు. వెంకటేష్‌ పాములు పట్టడంలో నిపుణుడు. వెంకటేష్‌ వెంటనే సీపీ నివాసానికి చేరుకుని పామును సురక్షితంగా రక్షించి బ్యాగులో వేశాడు. పామును నెహ్రు పార్క్‌వారికి అందజేయనున్నట్లు తెలిపాడు. పాములను చంపకుండా వాటికి కొత్త జీవితాన్ని ఇస్తున్న వెంకటేష్‌ సేవలకు గుర్తింపుగా సీపీ రివార్డును ప్రకటించారు. 

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ స్పందిస్తూ... పాములను చూడగానే వెంటనే భయాందోళనకు గురికావొద్దన్నారు. ఆ భయంలో వాటిని చంపొద్దన్నారు. పామును చూస్తే వెంటనే స్నేక్‌ సొసైటీ సభ్యులకు గానీ లేదా వాటిని పట్టుకునే వారికి గానీ సమాచారం అందజేయాలన్నారు. ఈ భూమిపై ప్రతీ జీవికి బ్రతికే హక్కు ఉందన్నారు. వాటికి మనం హాని తలపెట్టేంత వరకు అవి మనకు హాని తలపెట్టవని పేర్కొన్నారు.


logo