శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 01, 2020 , 23:10:21

స్మార్ట్ ఇండియా హాకథాన్ ప్రారంభం

స్మార్ట్ ఇండియా హాకథాన్ ప్రారంభం

హైదరాబాద్ : కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న స్మార్ట్ ఇండియా హాకథాన్ 2020 - సాఫ్ట్‌వేర్ ఎడిషన్ శనివారం ప్రారంభమైంది. ఈ కార్యకలాపాలను సులభతరం చేయడానికి నోడల్ కేంద్రాలలో ఒకటిగా ఉన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభించారు. 

ఈ కార్యక్రమానికి ఎస్‌ఈఈ ఇండియా, దక్షిణాది విభాగం గౌరవ చైర్మన్ ఎస్ షణ్ముగం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం - టీసీఎస్ రాపిడ్ ల్యాబ్స్ హెడ్ రాబిన్ టామీ కూడా పాల్గొన్నారు. సమాజంలోని అవసరాలను తీర్చగల సేవలు, సాంకేతిక పరిజ్ఞానాలతో ఇంజనీర్లు ముందుకు రావడానికి వినూత్న ఆలోచనలు, భావనలు అవకాశాలను అందిస్తాయని రాబిన్ టామీ చెప్పారు.

సామాజిక అవసరాలకు వెలుపల పరిష్కారాలను అందించాలని హాకథాన్ లో పాల్గొంటున్న వారికి ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కార్యదర్శి మర్రి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 40 నోడల్ హాకథాన్ కేంద్రాలలో ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి కావడం తనకు సంతోషంగా ఉన్నదని చెప్పారు.


logo