మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 06, 2020 , 07:25:35

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన ప్రవాహం..ఓ గేటు ఎత్తివేత

శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన ప్రవాహం..ఓ గేటు ఎత్తివేత

 నాగర్‌ కర్నూల్‌ :  శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి 97 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో అధికారులు ఓ గేటును ఎత్తి స్పిల్‌ వే ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు 27 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.8 టీఎంసీలు) కాగా ప్రస్తుతం పూర్తిగా నిండింది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించారు. జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 31 వేల క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 587.7 అడుగులు (306.14) టీఎంసీల నీరుంది. ఎడమ కాల్వ, జల విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 25 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo