మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 09:32:51

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌ : నిన్నటి వరకూ తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఈ మంగళవారం స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.60 పెరిగి రూ.46,960కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 పెరిగి రూ.51,240 వద్ద నిలిచింది. బంగారంతో పాటు వెండి ధర కూడా రూ.210ల పెరిగి రూ.52,210గా నమోదైయ్యింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.47,850 వద్ద నిలిచింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 పెరిగి రూ.49,050గా నమోదైయింది. వెండి ధర రూ.210 పెరిగి రూ. 52,210 చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో మార్పులు, స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo