Telangana
- Nov 27, 2020 , 07:44:14
‘నివర్’ ఎఫెక్ట్.. రాష్ట్రంలో నేడు, రేపు వానలు

హైదరాబాద్: నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజులపాటు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుఫాను బుధవారం అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరిలో తీరాన్ని తాకింది. దీంతో పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి తీవ్ర తుఫాను నుంచి వాయుగుండగా మారిన నివర్, ఇవాళ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. నిన్న ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ జిల్లాల్లో మోస్తరుగా వానలు కురిశాయి.
తాజావార్తలు
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం
- అనుచిత వ్యాఖ్యలు..వివాదంలో మోనాల్ గజ్జర్
- క్యాండీలు తినేందుకు ఉద్యోగులు కావలెను..
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
MOST READ
TRENDING