శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 09:36:52

సంచార జాతులు, అనాథలకు నైపుణ్య శిక్షణ

సంచార జాతులు, అనాథలకు నైపుణ్య శిక్షణ

హైదరాబాద్‌: బీసీ కులాల్లోని సంచార జాతులు(అత్యంత వెనుకబడిన తరగతులు), అనాథలైన యువతకు పలు కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఉచితంగా శిక్షణ ఇచ్చి, ప్రయోజకులను చేయనున్నది. 7 కోర్సులను ఎంపిక చేసి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఆ శాఖ అధికారులు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌ జిల్లాకు చెందిన ఆసక్తి గల యువతీ యువకులు మార్చి 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి విమలాదేవి సూచించారు. అంబర్‌పేట గోల్నాకలోని తమ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని ఆదేశించారు.logo