బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 15:24:17

మెరుగైన పర్యావరణాన్ని కాపాడుకోవాలి

మెరుగైన పర్యావరణాన్ని కాపాడుకోవాలి

హైదరాబాద్/నిర్మల్:  మెరుగైన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ తెలిపారు.  ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న ఆరో విడత తెలంగాణ హరితహారంపై నిర్మల్ జిల్లా కేంద్రం నుంచి అన్ని జిల్లాల అటవీశాఖ అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు.

కరోనా నేపధ్యంలో హరిత స్ఫూర్తిని చాటేలా తెలంగాణకు హరితహారం లోగోతో ఉన్న ఆకుపచ్చని మాస్కులను ధరించాలని సూచించారు.  ఈ ఏడాది నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, ఇప్పటివరకు ఐదు విడతల్లోనాటిన మొక్కల పరిస్థితిని జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు.

ఆరో విడతలో అడవుల బయట 20 కోట్లు, అడవుల లోపల 1.90కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ హరితహారంలో కోటీ చింత మొక్కలు నాటి భవిష్యత్ చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ లోకేష్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. 


logo