శనివారం 30 మే 2020
Telangana - May 14, 2020 , 21:07:06

జగిత్యాల జిల్లాలో ఆరుకు పెరిగిన పాజిటివ్‌ కేసులు

జగిత్యాల జిల్లాలో ఆరుకు పెరిగిన పాజిటివ్‌ కేసులు

ధర్మపురి : ముంబై వలస కూలీలతో జగిత్యాల జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే నాలుగు కేసులు పాజిటివ్‌ వచ్చి, అందులో ముగ్గురు డిచ్చార్జయి మరో వ్యక్తి ఒకట్రెండు రోజుల్లో డిచ్చార్జవుతాడని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మళ్లీ కేసులు పెరగడం కలవర పెడుతున్నది. ఈ నెల 12న వెల్గటూర్‌ మండలానికి చెందిన 55ఏళ్ల వలస కూలీకి కరోనా పాజిటివ్‌ రాగా చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించారు. రెండు రోజులు గడువకముందే వెల్గటూర్‌కే చెందిన మరో వలసకూలీకి పాజిటివ్‌ రావడంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. 

వెల్గటూర్‌ మండలం రాజక్కపల్లికి చెందిన 60ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌  తెలిపారు. సదరు వృద్ధుడుతో కారులో పెద్దపల్లి జిల్లా నందిమేడారానికి చెందిన ఇద్దరు, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలానికి చెందిన ఇద్దరు, డ్రైవర్‌తో కలిపి మొత్తం ఆరుగురు ఈ నెల 11న జిల్లాకు చేరుకున్నారు. చెక్‌పోస్టు వద్ద వైద్యులు అనుమానంతో వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. రక్తనమూనాలను పరీక్షలకు పంపగా రాజక్కపల్లికి చెందిన వృద్ధుడికి పాజిటివ్‌గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం కోసం అతడిని  హైదారాబాద్‌ గాందీ వైద్యశాలకు తరలించారు. మిగతా ఐదుగురిని ఐసొలేషన్‌లోనే ఉంచారు.  logo