e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home News Hyderabad's Weekend Spots | హైద‌రాబాదీలకు ప‌ర్‌ఫెక్ట్ వీకెండ్ స్పాట్స్‌.. డిటైల్స్ ఇవే !

Hyderabad’s Weekend Spots | హైద‌రాబాదీలకు ప‌ర్‌ఫెక్ట్ వీకెండ్ స్పాట్స్‌.. డిటైల్స్ ఇవే !

Hyderabad’s Weekend Spots | వ‌ర్క్ ఫ్రం హోంతోపాటు ఎడ‌తెగ‌ని కార్య‌క‌లాపాల‌తో వారం అంతా బిజీగా ఉండే హైద‌రాబాద్ న‌గ‌ర వాసులు వీకెండ్‌లో బ్రేక్ తీసుకోవ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. హైద‌రాబాద్ నుంచి వీకెండ్ హాయిగా, స‌ర‌దా గ‌డిపేందుకు పుష్క‌ల‌మైన ఆప్ష‌న్లు ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రి ఇంట్రెస్ట్‌ను బ‌ట్టి సేద తీర‌డానికి వార‌స‌త్వ క‌ట్ట‌డాలు.. ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌దేశాలు ఉన్నాయి. వీకెండ్‌లో హైద‌రాబాద్ నుంచి ఐదు గంట‌ల ప్ర‌యాణం చేస్తే శ్రీశైలం వ‌ద్ద సుందరమైన దృశ్యాలను వీక్షించొచ్చు. క్రుష్ణాన‌దిపై నిర్మించిన శ్రీశైలం డ్యామ్‌ను కూడా సంద‌ర్శించొచ్చు. భార‌త‌దేశంలోని అతిపెద్ద డ్యామ్‌ల్లో ఇదొక‌టి.. అంతే కాదు అతిపెద్ద మూడు జ‌ల విద్యుత్ కేంద్రాల్లో ఒక‌టి కూడా.

ప్రకృతి అందాల‌తోపాటు ఆధ్యాత్మిక శోభ ఇలా

క్రుష్ణా న‌ది ఒడ్డున కొలువు తీరిన మ‌ల్లిఖార్జున స్వామి దేవాల‌యానికి వెళ్లొచ్చు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒక‌టి ఇది. దీంతోపాటు భ్ర‌మ‌రాంబికా దేవి ఆల‌యం, శ‌శిగ‌ణ‌ప‌తి దేవాల‌యాల‌ను సంద‌ర్శించొచ్చు. ప్ర‌క్రుతి అందాల‌ను వీక్షించాలంటే ఫాల‌ధార పంచ‌ధార మ‌రో స్పాట్‌. ఇక భార‌త‌దేశంలోని అతిపెద్ద పులుల సంర‌క్ష‌ణ కేంద్రం నాగార్జున సాగ‌ర్‌-శ్రీశైలం అభ‌యార‌ణ్యంలో విహ‌రించొచ్చు. శ్రీశైలం రోప్‌వే, పాతాళ‌గంగ‌లో బోటింగ్‌తో ఉల్లాసాన్ని పొందొచ్చు.

డిండి నుంచి అంత‌ర్వేది ప్ర‌యాణం చాలా ఈజీ

- Advertisement -

కోస్తాంధ్ర ప‌ర్యాట‌క కేంద్రంగా ప‌రిఢ‌విల్లుతున్న డిండి కూడా హైద‌రాబాద్‌కు అత్యంత స‌మీపంలో ఉంది. రాత్రి రైలు ప్ర‌యాణం చేయ‌డానికి వీలైన కేంద్రం ఇది. ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి మారుపేరుగా ఉన్న డిండిలో సుందరమైన దృశ్యాలు అనేకం. ట్రెక్కింగ్‌, బ్యాక్ వాట‌ర్ ట్రిప్స్‌తో ఎంజాయ్ చేయొచ్చు. డిండిలో 20 కి.మీ. దూరం ప్ర‌యాణిస్తే అంత‌ర్వేది ఆల‌యాన్ని సంద‌ర్శించొచ్చు. ఆహార ప్రియులు కోన‌సీమ రుచులు కూడా టేస్ట్ చేయొచ్చు. ఇక్క‌డ బ‌స చేయ‌డానికి ప్రైవేట్‌, ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌తోపాటు ప‌లు రిసార్టులు కూడా ఉన్నాయి.

మిరుమిట్లు గొలిపే దృశ్యాలకు పెట్టింది పేరు మౌలాలీ ద‌ర్గా

హైద‌రాబాద్ న‌గ‌రానికి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది మౌలాలీ ద‌ర్గా. ఎత్తైన ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించాలని ఆస‌క్తి గ‌ల వారికి అనువైన కేంద్రం. స‌ముద్ర జ‌లాల‌కు 2017 అడుగుల ఎత్తున ఉన్న ఈ ద‌ర్గా నుంచి హైద‌రాబాద్ న‌గ‌ర అందాల‌నూ వీక్షించ‌డం చాలా ఈజీ. క‌నులు మిరుమిట్లు గొలిపే సూర్యోద‌య‌, సూర్యాస్త‌మ‌య సుంద‌ర దృశ్యాలకు పాపుల‌ర్‌. ఒక్క రోజులోనే ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించి, ఇంటికి చేరుకోవ‌చ్చు. ప్ర‌శాంతంగా గ‌డ‌పడానికి, ప్రార్థ‌న‌లు చేయ‌డానికి ప‌లు కుటుంబాలు ఈ ద‌ర్గాను సంద‌ర్శిస్తాయి.

స్వ‌చ్ఛ‌మైన నీటితో ఆలరిస్తున్న కొండ‌పోచమ్మ సాగ‌ర్‌

ఇటీవ‌లి కాలంలో అత్యంత ప‌ర్యాట‌క కేంద్రాల్లో ఒక‌టిగా కొండ పోచ‌మ్మ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ నిలిచింది. సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ రిజ‌ర్వాయ‌ర్‌.. హైద‌రాబాద్ న‌గ‌రానికి 50 కి.మీ. దూరంలో ఉంది. స్వ‌చ్ఛ‌మైన నీళ్లు, అందంగా అలంక‌రించిన శిల‌లు సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్దుల్ని చేస్తాయి.

ట్రెక్కింగ్‌.. లాంగ్ డ్రైవ్‌కు బెస్ట్ రాచ‌కొండ ఫోర్ట్‌

హైద‌రాబాద్ న‌గ‌రానికి 60-70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న 14వ శ‌తాబ్దికి చెందిన కోట రాచ‌కొండ ఫోర్ట్‌. మీకు, మీ బంధు మిత్రుల ట్రెక్కింగ్‌కు గానీ, లాంగ్ డ్రైవ్ వెళ్ల‌డానికి అనువైన కేంద్రం ఇది. యాదాద్రి-భువ‌న‌గిరి జిల్లాలోని కొన్ని ప‌ల్లెటూళ్ల మ‌ధ్య ఉన్న ఈ కోట చాలా మందికి తెలియ‌దు. అందుకే సంద‌ర్శ‌కులు త‌క్కువ‌. కోట పై నుంచి చూస్తే చిన్న పాటి జ‌ల వ‌న‌రులు, చుట్టుప‌క్క‌ల ఆకుప‌చ్చ‌ని పంట పొలాల‌తో క‌మ్మేసిన ప‌ల్లెటూళ్లు.. ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి.

క్విక్ వీకెండ్ స్పాట్ శామీర్‌పేట చెరువు

హైద‌రాబాద్ న‌గ‌రానికి 10 కి.మీ. దూరంలో ఉన్న శామీర్‌పేట చెరువు క్విక్ వీకెండ్ స్పాట్‌. ర‌క‌ర‌కాల శిల‌ల‌తో అలంక‌రించిన ఈ చెరువు అందంగా క‌నిపిస్తుంది. ఈ చెరువుకు ఒక‌వైపు జింక‌ల పార్క్ కూడా కొలువుదీరి ఉంది. జింక‌లు స్వేచ్ఛ‌గా గంతులేస్తూ విహ‌రిస్తున్న ద్రుశ్యాల‌ను వ‌ర్ణించాలంటే కండ్లు చాల‌వు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana