శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 12:09:55

నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి జరిమానా

నిబంధనలు ఉల్లంఘించిన ఆరుగురికి జరిమానా

మహబూబ్ నగర్ : రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు పెట్టుకోవాలని పలు జాగ్రత్తలను సూచించింది. అయితే కొంత మంది నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు ధరించకుండా షాపులు తెరవడం, ప్రయాణాలు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. 

ఇలాంటి వారి పట్ల అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జరిమానాలు విధించి కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని బాలానగర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో నిర్ణీత దూరం, మాస్కులు లేకుండా కిరాణ షాపులు నిర్వహిస్తున్న ఆరుగురు యజమానులకు తహసీల్దార్ శంకర్ జరిమానా విధించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరించారు.


logo