బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 19:20:06

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు క్ర‌స్ట్ గేట్లు ఆరు ఎత్తివేత‌

నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు క్ర‌స్ట్ గేట్లు ఆరు ఎత్తివేత‌

న‌ల్ల‌గొండ : నాగార్జున‌సాగ‌ర్ ప్రాజెక్టు క్ర‌స్ట్ గేట్లు ఆరింటిని అధికారులు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. ఈ ఉద‌యం ఎనిమిది గేట్ల‌ను 10 అడుగుల మేర ఎత్తిన అధికారులు ప్రాజెక్టుకు నీటి ప్ర‌వాహం త‌గ్గ‌డంతో సాయంత్రానికి రెండు గేట్ల‌ను బంద్ చేసి ఆరు గేట్ల‌ను మాత్ర‌మే ఎత్తారు. డ్యాంకు ఉద‌యం 1,65,245 క్యూసెక్కుల ప్ర‌వాహం కొన‌సాగ‌గా సాయంత్రానికి 1,57,349 క్యూసెక్కులకు ప‌డిపోయింది. దిగువ‌కు 1,26,599 క్యూసెక్కుల నీటిని వ‌దులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 590 అడుగులు కాగా ప్ర‌స్తుత నీటి నిల్వ ప్ర‌స్తుతం 589.4 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి సామ‌ర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్ర‌స్తుతం 310 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి నీటి ప్ర‌వాహాల‌ను అనుస‌రించి ప్రాజెక్టు గేట్ల‌ను ఎత్తే విష‌యంలో చ‌ర్య‌లు ఉంటాయని అధికారులు వెల్ల‌డించారు.


logo