మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 11:56:53

మంచిర్యాల జిల్లాలో 28కి చేరిన కరోనా కేసులు

మంచిర్యాల జిల్లాలో 28కి చేరిన కరోనా కేసులు

మంచిర్యాల: జిల్లాలో కొత్తగా మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముంబై నుంచి వచ్చిన వారికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌ తరలించారు. కొత్తగా నమోదైన ఈ ఆరు కేసులతో జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 28కి పెరిగింది. ఇందులో 27 మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారే కావడం గమనార్హం.

మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కిష్టాపురం, రోతిగూడ గ్రామాలకు చెందినవా ఆరుగురు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామని జిల్లా కరోనా నోడల్‌ ఆఫీసర్‌ బాలాజీ తెలిపారు. వారిని బెల్లంపల్లిలోని ఇన్సోలేషన్‌ నుంచి హైదరాబాద్‌కు తరలించామని ఆయన వెల్లడించారు. 

ఈ నెల 21న ముంబై నుంచి వచ్చిన నలుగురు వలస కార్మికులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. జన్నారం, హాజీపూర్‌, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలకు చెందిన సుమారు రెండు వేల మంది వలస కార్మికులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. జిల్లాలో ఏప్రిల్‌లో కరోనా కేసు ఒక్కటి మాత్రమే నమోదయ్యింది. జిల్లాకు వలస కార్మికుల రాక ప్రారంభమైనప్పటి నుంచి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.


logo