శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 05:59:34

గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని.. ఆరుగురు మృతి

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం పాటి సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైలో కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు సురక్షితంగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు జార్ఖండ్‌ ఘోరఖ్‌పూర్‌, రాంఘడ్‌కు చెందిన కార్పెంటర్లుగా గుర్తించారు.

గచ్చిబౌలి నుంచి జార్ఖండ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ పుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన వాహనం గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.