శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 05, 2020 , 17:36:23

చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురికి తీవ్ర గాయాలు

చెట్టును ఢీకొన్న కారు: ఆరుగురికి తీవ్ర గాయాలు

నిజామాబాద్‌: జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వస్తున్న ఏపీ 01 ఏఎఫ్ 7299 కారు చెట్టును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


logo