సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 18:58:11

పాత సచివాలయ శిథిలాల్లో కూర్చోం : జగదీశ్ రెడ్డి

 పాత సచివాలయ శిథిలాల్లో కూర్చోం : జగదీశ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి  జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌ అండ్‌ గ్యాంగ్‌ మాటలు వింటుంటే.. వారి బానిస మనస్తత్వం బయటపడుతోందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. విద్యుత్‌ పంపిణీలో దేశానికే తెలంగాణ ఆదర్శమని, మిషన్‌ భగీరథ ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తున్నామన్నారు. రైతుబంధు, రైతు బీమా కాంగ్రెస్‌ నేతలకు కలలో కూడా సాధ్యం కాదన్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు ఇచ్చే పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్‌ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు చేసిన మేలేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో పెండింగ్‌లో  పెట్టిన ప్రాజెక్టులను తాము పూర్తిచేశామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని వ్యాఖ్యానించారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. పాత సచివాలయ శిథిలాల్లో కూర్చోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. కొత్త సచివాలయం నిర్మిస్తామని ప్రజలకు చెప్పామని, చేస్తున్నామన్నారు.


logo