సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 12:36:07

మల్లాపూర్ లో లిఫ్ట్, పంపు హౌస్ నిర్మాణం కోసం స్థల పరిశీలన

మల్లాపూర్ లో లిఫ్ట్, పంపు హౌస్ నిర్మాణం కోసం స్థల పరిశీలన

పెద్దపల్లి : జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామ శివారులోని పులి చేరుకుంట వద్ద లిఫ్ట్ ఏర్పాటు, పంపు హౌస్ నిర్మాణం కోసం అధికారులు స్థల పరిశీలన చేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎస్పారెస్పీ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణరావు, ఈఈ రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి స్థల పరిశీలన చేశారు. సాధ్యాసాధ్యాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

తాజావార్తలు


logo