మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:21:33

సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ పనుల పరిశీలన

సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ పనుల పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో నేడు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్‌, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్‌సీ మురళిధర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు దగ్గర సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ పనులను వీరు పరిశీలించారు. పనుల పురోగతిపై ఎస్‌ఈ, సీఈ లను వివరాలడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం పనులు వేగంగా చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులు, కాట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించారు.


logo