బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 14:28:02

భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి క‌ల్యాణం

భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి క‌ల్యాణం

భ‌ద్రాద్రి కొత్తగూడెం:  భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు  నిరాడంబ‌రంగా జ‌రిగాయి.  కరోనా వైరస్‌ కారణంగా ఈ సారి భక్తజనం లేకుండానే సీతారామ కల్యాణం, పట్టాభిషేకం క్రతువులు నిర్వ‌హించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రులు అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్  శ్రీసీతారాముల స్వామివారికి ముత్యాల త‌లంబ్రాలు, ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.  వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో స్వామివారి కల్యాణం జ‌రిగింది. ఏటా మిథిలా స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించేవారు. ఈసారి ఆలయంలోని మండపంలోనే రాములవారి కల్యాణ వేడుక నిర్వ‌హించారు.  ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, వేదపండితులు, అర్చకులు, ఆల‌య‌, ఇత‌ర శాఖ‌ల  అధికారులు ఈ వేడుకకు హాజ‌ర‌య్యారు.


logo