సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 01:38:20

పీసీసీ ఎంపిక తీరుపై సీతక్క అసంతృప్తి

పీసీసీ ఎంపిక తీరుపై సీతక్క అసంతృప్తి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడంలేదు. రేవంత్‌రెడ్డికి పీసీసీ ఖరారైందన్న ప్రచారంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే సీనియర్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా అదే బాటలో పీసీసీ ఎంపిక విధానంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. పీసీసీ ఎంపికలో తన అభిప్రాయం తీసులేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షంలో సభ్యురాలినే అయినా, తన అభిప్రాయం తీసుకోకుండా అవమానించారని తెలిపారు. కార్యకర్తలకు నమ్మకం కలిగించే వారినే ఎన్నుకోవాలన్నారు. తాను పార్టీలోనే ఉంటానని, అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని చెప్పారు.