Telangana
- Dec 22, 2020 , 09:18:51
నేడు బలరాముడిగా దర్శనమివ్వనున్న భద్రాద్రి రామయ్య

హైదరాబాద్ : భద్రాద్రి రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రుడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుండగా.. మంగళవారం స్వామివారు బలరాముడి అవరాతంలో భక్తులకు అనుగ్రహించనున్నారు. అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారిని బలరాముడిగా అలంకరించి చిత్రకూట మండపానికి వేంచేపు చేయనునున్నారు. అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 24న ఆలయ పుష్కరిణిలో లక్ష్మణ సమేత సీతారాముల తెప్పోత్సవం జరుగనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 25న తెల్లవారు జామున 5 గంటలకు ఉత్తర ద్వారం నుంచి భద్రగిరీశుడు భక్తులకు దర్శనమివ్వనుండగా.. ఆలయ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING