ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 14:07:18

భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం.. పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు

భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం.. పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కొనసాగుతుంది. స్వామివారికి ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. నిత్య కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని చేపట్టారు. ఈసారి రాములవారి కల్యాణోత్సవం నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ హాజరుకావొద్దని ప్రభుత్వం సూచించింది. దీంతో భక్తులు లేకుండానే కల్యాణ వేడుకలు జరుగుతున్నాయి. కేవలం 40 మంది ముఖ్యులు, వైదిక పెద్దలు, అర్చకుల సమక్షంలో సీతారాముల కల్యాణ వేడుకలు జరుగుతున్నాయి.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo