గురువారం 09 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 12:55:07

సిరిసిల్ల ప్రగతి స్ఫూర్తిదాయకం : మంత్రి కేటీఆర్

సిరిసిల్ల ప్రగతి స్ఫూర్తిదాయకం : మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల : జిల్లా పర్యటనలో భాగంగా ఐటీ, పురపాకల శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.5.15కోట్ల తో సిరిసిల్ల పట్టణంలో నిర్మించిన అధునాతన రైతు బజార్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మార్కెట్ లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇతర జిల్లాలకు ఆదర్శవంతంగా సిరిసిల్లలో అభివృద్ధి జరుగుతుందన్నారు. రోహిణి కార్తెలో కూడా చెరువులు నింపడం సీఎం కేసీఆర్ పనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మూడేండ్లలో పూర్తి చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు అద్దం పడుతుందన్నారు.

కాలంతో పోటీ పడి కాళేశ్వరం ప్రాజెక్ట్  పూర్తి చేసుకున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షోభ సమయంలోనూ ఒక్క రోజులోనే 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ. 25 వేల లోపు రుణమాఫీ ఒకేసారి అమలు చేశామని వెల్లడించారు. వ్యవసాయ రంగానికి మహర్ద దశ పట్టనుందని, విదేశాలకు చేపలు, రొయ్యలు ఎగుమతి చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. రైతును రాజును చేయడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. వ్యాపారులు మార్కెట్ లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు.


logo