శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:05

వ్యవసాయబావిలో చిరుత పులి

వ్యవసాయబావిలో చిరుత పులి

బోయినపల్లి, జనవరి 13: కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్‌లో వ్యవసాయ బావిలో చిరుతపులి పడింది. గ్రామానికి చెందిన కోరేపు సురేశ్‌ అనే రైతు ఉదయం11 గంటలకు బావిలో నీరెంత ఉందో పరిశీలిస్తుండగా చిరుత కనిపించింది. వెంట నే దరికి ఉన్న సొరికెలో నక్కింది. విషయాన్ని పోలీసులు, అటవీశాఖ అధికారులకు తెలుపగా వారు మల్కాపూర్‌ చేరుకున్నారు. చిరుతను బావిలోంచి బయటికి తీసుకొచ్చేందుకు హైదరాబాద్‌ నుంచి రెస్యూ బృందాన్ని రప్పించినట్టు వేములవాడ అటవీశాఖ సెక్షన్‌ అధికారి సౌమ్య తెలిపారు. బావిలోకి దిగేందుకు నిచ్చెనలు, చిరుతపులిని బంధించేందుకు వలలు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. కాగా, చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను నిలిపివేశారు. గురువారం ఉదయం చిరుతను బయటికి తీయనున్నట్టు వెల్లడించారు.


logo