బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Aug 31, 2020 , 02:37:24

కేసీఆర్‌ది దక్షతతో కూడిన పాలన

కేసీఆర్‌ది దక్షతతో కూడిన పాలన

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

నారాయణపేట: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ దక్షతతో కూడిన పాలన సాగిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం నారాయణపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగటుకు మించిన వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో 1.35 కోట్ల ఎకరాలల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారని, వరి సాగు కొనసాగుతున్నందున మరో 4 లక్షల ఎకరాలు పెరిగే అవకాశం ఉన్నదన్నారు. ఎరువుల కొరత లేకుండా వ్యవసాయశాఖ చర్యలు తీసుకున్నదన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతో 22 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కేటాయించాలని కేంద్రానికి నివేదించామని చెప్పారు.  


logo