మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 25, 2020 , 02:01:58

షూటింగ్‌లకు సింగిల్‌విండో పాలసీ

షూటింగ్‌లకు సింగిల్‌విండో పాలసీ

  • పర్యాటక ప్రాంతాలను వినియోగించుకోవాలి
  • సినిమా రంగానికి సహకారం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, సినిమా చిత్రీకరణకు అనువుగా ప్రభుత్వం సింగిల్‌ విండో పాలసీని తీసుకొస్తున్నదని పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సోమవారం ఈ అంశంపై రవీంద్రభారతిలోని కార్యాలయంలో సినీ నిర్మాతలు, ముఖ్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని.. సినిమా షూటింగులకు ఎన్నో ప్రాంతాలు అనువుగా ఉన్నాయని తెలిపారు.  షూటింగులను ప్రోత్సహిస్తామని, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, టూరిజం శాఖల మధ్య సహకారం ఉంటుందని తెలిపారు. స్థానికంగా అందమైన లోకేషన్లలో సినిమాలను చిత్రీకరించడంతో అనవసర ఖర్చులు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, టీఎస్‌ఎఫ్డీసీ చైర్మన్‌ పీ రామ్మోహన్‌రావు, సాట్స్‌చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, సినీ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, ఆదిశేషగిరిరావు, కేఎస్‌ రామారావు, టూరిజం ఎండీ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

కేరళ టెక్నాలజీతో నీరా ఉత్పత్తి

కొబ్బరి నీటి సేకరణ, నిల్వలో కేరళ టెక్నాలజీ, సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధనల సహకారంతో నీరా ఉత్పత్తికి కార్యాచరణ రూపొందించాలని ఎక్సైజ్‌శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. నీరా ప్రాజెక్టుపై సోమవారం విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, జాయింట్‌ కమిషనర్‌ అజయ్‌రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ జే హరికిషన్‌, రిటైర్డ్‌ డిప్యూటీ కమిషనర్‌ విష్ణుస్వరూప్‌రెడ్డి, ఎక్సైజ్‌ సూపరిండెంట్లు హెచ్‌ దత్తురాజ్‌గౌడ్‌, ఏ చంద్రయ్య, కే గణేశ్‌, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌ జనార్దన్‌, సైంటిస్టు కేఆర్‌ సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.


logo