శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 11:44:10

రాష్ట్రంలో కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి తగ్గడం లేదు. కరోనా విజృంభణ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 8 మంది చనిపోయారు. తెలంగాణలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరగా, ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.86 శాతం కాగా, దేశ వ్యాప్తంగా ఆ రేటు 2.3 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 15,654 మంది నమూనాలను పరీక్షించగా, 1,593 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రతి 10 లక్షల జనాభాలో 391 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో 17 వేల పడకలు

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం 17 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 11,928 ఐసోలేషన్‌ పడకలు, 3,537 ఆక్సిజన్‌ పడకలు, 1,616 ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఐసోలేషన్‌ వార్డుల్లో 627, ఆక్సిజన్‌ పడకల్లో 1,190, ఐసీయూ బెడ్లలో 317 మంది చికిత్స పొందుతున్నారు. మిగతా బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. 1,117 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి.

గాంధీ ఆస్పత్రిలో పడకల పరిస్థితి

కొవిడ్‌ చికిత్సకు తలమానికంగా ఉన్న గాంధీ ఆస్ప్రతిలో మొత్తం బెడ్లు 1,890 ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో 815 మంది కొవిడ్‌ చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 123 మంది, ఆక్సిజన్‌ వార్డులో 433, మిగతా వార్డుల్లో 259 మందికి చికిత్స కొనసాగుతోంది. గాంధీలో ఇంకా 1,075 పడకలు ఖాళీగా ఉన్నాయి. 

ఏయే జిల్లాలో ఎన్ని కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 640, రంగారెడ్డి జిల్లాలో 171, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 131, మేడ్చల్‌ జిల్లాలో 91, కరీంనగర్‌ జిల్లాలో 51, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 46, ఆదిలాబాద్‌ జిల్లాలో 14, భద్రాద్రిలో 17, జగిత్యాలలో 2, జనగామలో 21, భూపాలపల్లిలో 3, జోగులాంబ గద్వాలలో 5, కామారెడ్డిలో 36, ఖమ్మంలో 18, మహబూబ్‌నగర్‌లో 38, మహబుబాబాద్‌లో 29, మంచిర్యాలలో 27, మెదక్‌లో 21, ములుగులో 12, నల్లగొండలో 6, నారాయణపేటలో 7, నిర్మల్‌లో 1, నిజామాబాద్‌లో 32, పెద్దపల్లిలో 16, సిరిసిల్లలో 27, సంగారెడ్డిలో 61, సిద్దిపేటలో 5, సూర్యాపేటలో 22, వికారాబాద్‌లో 9, వనపర్తిలో 1, వరంగల్‌ రూరల్‌లో 21, యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 


logo