ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 16:00:47

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న గాయని మధుప్రియ

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న గాయని మధుప్రియ

హైదరాబాద్‌ : ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ మూడవ విడత కార్యక్రమంలో గాయని మధుప్రియ పాల్గొంది. నగరంలోని చిలుకానగర్‌ కర్పొరేటర్‌ గోపు సరస్వతితో కలిసి ఆమె నేడు ఉప్పల్‌లో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మధుప్రియ మాట్లాడుతూ... ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మానవాళికి మంచి చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తూ తనలాంటి వారిని ఇందులో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

మొక్కల్ని నాటుదాం. నాటిన ప్రతీ మొక్కని కాపాడుదాం అనే నినాదంతో సాగుతున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం మరింత ముందుకు సాగాలని ఆకాక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సింగర్‌ మధుప్రియ, కార్పొరేటర్‌ గోపు సరస్వతి మరో ముగ్గురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు. తెలంగాణ నుండి మొదటి మహిళా పైలట్‌ సంజన, జీహెచ్‌ఎంసీ ఉప్పల్‌ కమిషనర్‌ అరుణకుమారి, నటుడు మధు లకు వీరు గ్రీన్‌ ఛాలెంజ్‌ను విసిరారు.logo