గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 02:16:39

కరోనా చికిత్సకు సింగరేణి సన్నద్ధం

కరోనా చికిత్సకు సింగరేణి సన్నద్ధం

  • ఆరు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలతో ఒప్పందం
  • 1,800 డోసుల అత్యవసర ఇంజెక్షన్ల కొనుగోలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సింగరేణి ప్రాంతంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో యాజమాన్యం సంరక్షణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఆరు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలతో ఒప్పందం కుదుర్చుకున్నది. దీనికి తోడు హెటిరో తయారుచేసిన ఖరీదైన 1,800 డోసుల ఇంజెక్షన్లను కొనుగోలుచేసింది. మంగళవారం అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో సంస్థ డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌, బలరాం సింగరేణి భవన్‌ నుంచి వీడియోకన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

సింగరేణి ఏరియాలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ సెంటర్లలో వైద్య సిబ్బందికి అవసరమైన సహాయకులను తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. వైద్యసిబ్బంది, సహాయకులకు ఎటువంటి భయం లేకుండా పనిచేయడానికి వారిలో స్ఫూర్తినింపాలని తెలిపారు. కార్యక్రమంలో జీఎం కోఆర్డినేటర్‌ రవిశంకర్‌, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ మంతా శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


logo