సోమవారం 01 జూన్ 2020
Telangana - May 19, 2020 , 23:22:54

గురువారం నుంచి బొగ్గు గనులు ప్రారంభం

గురువారం నుంచి బొగ్గు గనులు ప్రారంభం

మంచిర్యాల:  సింగరేణి గనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సింగరేణి యాజమాన్యం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 2 వ తేదీ నుంచి యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి అత్యవసర సిబ్బంది తప్ప ఎవరూ విధులకు హాజరు కావడం లేదు. 22 భూగర్భ గనుల్లో ఏప్రిల్‌ 2 రెండవ షిప్టు నుంచి ఈ లేఫ్‌ కొనసాగించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సింగరేణి యాజమాన్యంతో పాటు కోలిండియాలో భూగర్భ గనులు మూసివేయాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ ఆదేశాల మేరకు లే ఆఫ్‌ ప్రకటించారు.

మొదట 14 తేదీ వరకు ప్రకటించిన యాజమాన్యం దానిని పొడిగిస్తూ వచ్చింది. 7 ఎల్‌పీ, వీకే7, శాంతిఖని, జీడీకే11ఏ, కొండాపూర్‌ మెకనైజ్డ్‌ గనులతో పాటు 18 ఓపెన్‌కాస్టులు పనిచేస్తున్నాయి. లే ఆఫ్‌ సందర్భంగా కార్మికులు గనులపైకి వచ్చి మస్టర్‌ పడితేనే జీతం వస్తుంది. కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావ్‌ చర్చల ఫలితంగా వారు గనులపైకి రాకుండానే జీతం వచ్చేలా యాజమాన్యం అంగీకరించింది.logo