సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 00:37:05

సింగరేణి పరీక్షపై విచారణ

సింగరేణి పరీక్షపై విచారణ

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సింగరేణి సంస్థలో 68 మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(ఈఅండ్‌ఎం) పోస్టుల రాత పరీక్షలో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన ఘటనపై విచారణ కొనసాగుతున్నది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ రాత పరీక్ష వ్యవహారంలో సింగరేణి అధికారుల పాత్ర ఉన్నట్టు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరీక్ష రాసేందుకు ఢిల్లీలోని ఏజెంట్‌ ద్వారా విమానంలో హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి కార్లలో కొత్తగూడేనికి చేరుకున్న హర్యానాకు చెందిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు ముగ్గురు డ్రైవర్లు, ఇద్దరు గైడ్‌ మీడియేటర్లను కూడా పోలీసులు విచారిస్తున్నా రు. 


అయితే ఒక కారులో వచ్చిన వారు మా త్రమే పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసిం ది. మిగతా రెండు కార్లలో వచ్చిన వ్యక్తులెవరు?.. వారు ఎవరి స్థానంలో పరీక్షలు రాశారనే విషయం తెలియాల్సి ఉంది. ఈ పరీక్షల గుట్టు రట్టు చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ సమగ్రంగా విచారిస్తున్నట్టు సింగరేణి అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు. నిందితులు ఒక్క సింగరేణి పరీక్షలే కాకుండా ఎంసెట్‌, నీట్‌, గేట్‌, జేఈఈ మెయిన్‌ తదితర పోటీ పరీక్షలు కూడా రాస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుండగా సోమవారం భోజన విరామ సమయం తరువాత సింగరేణి కార్పొరేట్‌ సేఫ్టీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న హరీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది.  


logo